Home Headlines మహేష్ సినిమా లోంచి అతడ్ని తీసేస్తారా
TOLLYWOOD
 HEADLINES

మహేష్ సినిమా లోంచి అతడ్ని తీసేస్తారా

Murali R | Published:August 8, 2017, 12:00 AM IST

మహేష్ బాబు తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ఆ చిత్రంలో కీలక పాత్రలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు . అయితే తాజాగా జరుగుతున్న షెడ్యుల్ లో పాల్గొనాల్సి ఉండగా షూటింగ్ కి రాకుండా పోయాడు అంతేకాదు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదట ! దాంతో షూటింగ్ పేకప్ చెప్పాల్సి వచ్చింది.

ఇంతకుముందు కూడా ప్రకాష్ రాజ్ పలు చిత్రాలకు ఇలాగే చేసి దర్శక నిర్మాతలను అలాగే నటీనటులను ఇబ్బంది పెట్టాడు . అప్పట్లో ఈ ఆరోపణలు ఎక్కువగా ఉండేవి ఇప్పుడు మళ్ళీ వినిపిస్తున్నాయి . అందుకే ప్రకాష్ రాజ్ స్థానంలో మరో నటుడి ని తీసుకుందామా అనే ఆలోచనలో ఉన్నారట మహేష్ దర్శక నిర్మాతలు.

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..