Home Headlines మంచు మనోజ్ సినిమా వాయిదాపడింది
TOLLYWOOD
 HEADLINES

మంచు మనోజ్ సినిమా వాయిదాపడింది

Murali R | Published:September 4, 2017, 12:00 AM IST
మంచు మనోజ్ హీరోగా నటించిన '' ఒక్కడు మిగిలాడు '' చిత్రం రిలీజ్ వాయిదా పడింది . ఈనెల 8న భారీ ఎత్తున ఒక్కడు మిగిలాడు సినిమాని రిలీజ్ చేయడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేసారు కానీ సమయం తక్కువ ఉండటం , ఒకేరోజున నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుండటం ....... ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నాయని చెబుతూ ఆ సినిమా రిలీజ్ వాయిదా వేశారు ఇక ఈ సినిమాని వచ్చే నెల అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మంచు మనోజ్ అరివీర భయంకరుడైన ఎల్టీటీయి అధినేత ప్రభాకరన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే . శ్రీలంక లో తమిళుల హక్కుల కోసం పోరాడిన ప్రభాకరన్ భీకర పోరు లో చనిపోయిన విషయం తెలిసిందే . ఈ చిత్రంలో మంచు మనోజ్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు . ఈ సినిమాతో అజయ్ ఆండ్రుస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు . మంచు మనోజ్ కి తప్పనిసరిగా ఓ  హిట్ కావాలి కానీ సెప్టెంబర్ 8న మరో మూడు సినిమాలు వస్తున్నాయి దాంతో మంచు మనోజ్ సినిమాని వచ్చే నెలకి వాయిదా వేశారు.

Related Links

manchu manoj 'okkadu migiladu' on september 8th
manchu manoj okkadu migiladu trailer talk
Manchu Manoj first Look from Okkadumigiladu
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..