Home Headlines కొడుకుతో తీయమని 12 కోట్ల ఆఫర్ ఇచ్చాడట
TOLLYWOOD
 HEADLINES

కొడుకుతో తీయమని 12 కోట్ల ఆఫర్ ఇచ్చాడట

Saturday June 17th 2017
నాగచైతన్య హీరోగా సక్సెస్ అయ్యాడు కానీ స్టార్ డం ని మాత్రం అందుకోలేక పోతున్నాడు , లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది అడపా దడపా హిట్స్ కూడా వస్తున్నాయి కానీ నాగార్జున కోరుకుంటోంది స్టార్ డం అందుకే ఇలా అయితే లాభం లేదని బోయపాటి శ్రీను లాంటి మాస్ దర్శకుడి చేతిలో పడితేనే నాగచైతన్య మాస్ హీరో అవుతాడని భావిస్తున్నాడట అందుకే బోయపాటి కి కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చాడట.

తన కొడుకు నాగచైతన్య తో మాస్ సినిమా చేస్తే 12 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడట . హీరోలను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసే దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరన్న విషయం తెలిసిందే . ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో జయ జానకి నాయక అనే సినిమా చేస్తున్నాడు బోయపాటి దాని తర్వాత చిరంజీవి తో చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు . ఒకవేళ అది కుదరకపోతే నాగచైతన్య తో సినిమా చేస్తాడు బోయపాటి.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..