Home Headlines ఆ సినిమా చూడొద్దని చెప్పాడట
TOLLYWOOD
 HEADLINES

ఆ సినిమా చూడొద్దని చెప్పాడట

Murali R | Published:October 4, 2017, 9:38 AM IST
సమంత ఆత్మగా నటించిన రాజుగారి గది 2 చిత్రం చూసావంటే సమంత తో కలిసి ఒకే గదిలో పడుకోలేవు అంతగా భయపెడుతుంది అని నాగచైతన్య కు సలహా ఇచ్చాడట నాగార్జున , ఇంకేముంది తండ్రి లాంటి సీనియర్ నటుడే అలా సలహా ఇచ్చాడు కాబట్టి నేను అస్సలు రాజుగారి గది 2 చూడనని చెప్పాడట నాగచైతన్య. కింగ్ నాగార్జున కీలక పాత్రలో రూపొందించిన చిత్రం రాజుగారి గది 2.

సమంత ఈ చిత్రంలో ఆత్మగా నటించింది. క్లైమాక్స్ ఎపిసోడ్ లో కానీ అంతకుముందు కానీ సమంత విపరీతంగా భయపెడుతుందట . దాంతో నాన్న ఆ సినిమా చూడకు ఎందుకంటే సమంత ని పెళ్లి చేసుకుంటున్నావ్ కాబట్టి , ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉండాలి కాబట్టి ఆ సినిమా చూస్తే సమంత తో కలిసి ఉండలేవని డైరెక్ట్ గా చెప్పాడట . చైతూ కూడా రియలైజ్ అయి రాజుగారి గది 2 చూడనని చెప్పాడని నాగార్జున తెలిపాడు. ఈనెల 6, 7 తేదీలలో సమంత  , నాగచైతన్య పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..