Home Headlines సక్సెస్ ఫుల్ దర్శకుడితో నాని తదుపరి సినిమా
TOLLYWOOD
 HEADLINES

సక్సెస్ ఫుల్ దర్శకుడితో నాని తదుపరి సినిమా

Monday June 12th 2017

నాని వరుసగా హిట్ చిత్రాలు చేస్తూ హీరోగా తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు . ఇప్పటికే నాని నటించిన నిన్ను కోరి చిత్రం జూలై 7 న రిలీజ్ కి సిద్దంగా ఉండగా వచ్చే నెలలో మరో కొత్త సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నాడు . వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి సూపర్ హిట్ చిత్రంతో దర్శకుడి గా తెలుగు తెరకు పరిచయమైన మేర్లపాక గాంధీ తో నాని సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత శర్వానంద్ తో ఎక్స్ ప్రెస్ రాజా సినిమా చేసి పెద్ద హిట్ కొట్టాడు మేర్లపాక గాంధీ . తాజాగా నానికి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి సంతోషంగా అంగీకరించాడట నాని . దాంతో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన పూర్తీ వివరాలు తెలియనున్నాయి.

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..