Home Headlines ఎన్టీఆర్ సినిమాపై అవన్నీ పుకార్లేనట
TOLLYWOOD
 HEADLINES

ఎన్టీఆర్ సినిమాపై అవన్నీ పుకార్లేనట

Murali R | Published:August 14, 2017, 12:00 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న జై లవకుశ చిత్రంపై బోలెడు పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి . తాజాగా ఈ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్ కావడం కష్టమే అని ఎందుకంటే ఇంకా షూటింగ్ ఉంది , అప్పుడే ఆగస్టు సగం నెల గడిచిపోయింది కాబట్టి సెప్టెంబర్ 21న రిలీజ్ అవ్వడం కష్టమే అని కొంతమంది పనిగట్టుకొని ప్రచారం చేస్తుండటంతో ఈ విషయం జై లవకుశ యూనిట్ చెవిన పడింది దాంతో ఆ చిత్ర యూనిట్ స్పందించింది.

షూటింగ్ కార్యక్రమాలు అనుకున్న విధంగానే సాగుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా సెప్టెంబర్ 21న సినిమా రిలీజ్ అవడం ఖాయమని , ఎటువంటి ఇబ్బంది లేదని కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు . ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా , నివేదా థామస్ లు హీరోయిన్ లుగా నటిస్తుండగా బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..