Home Headlines 125 కోట్లు వసూల్ చేసిన ఎన్టీఆర్
TOLLYWOOD
 HEADLINES

125 కోట్లు వసూల్ చేసిన ఎన్టీఆర్

Murali R | Published:October 4, 2017, 1:20 PM IST
12 రోజుల్లో 125 కోట్లు వసూల్ చేసి బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సెప్టెంబర్ 21న భారీ ఎత్తున రిలీజ్ అయిన జై లవకుశ పన్నెండు రోజుల్లో 125 కోట్ల గ్రాస్ వసూళ్ల ని , 72 కోట్ల షేర్ ని వసూల్ చేసాడు ఎన్టీఆర్. జై లవకుశ బయ్యర్లు కూడా లాభాల బాటలో పయనించాలంటే మరో 23 కోట్ల షేర్ రాబట్టాలి.

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం , అందునా జై పాత్ర లో ఎన్టీఆర్ నటవిశ్వరూపానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈరోజుతో దసరా సెలవులు పూర్తవుతున్నాయి దాంతో ఎన్టీఆర్ కు అసలైన పరీక్ష మొదలుకానుంది. ఎందుకంటే జై లవకుశ మరో 23 కోట్లు వసూల్ చేస్తేనే బయ్యర్లు లాభాలలోకి వస్తారు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..