Home Headlines బిగ్ బాస్ ఎన్టీఆర్ లుక్ ఇదే
TOLLYWOOD
 HEADLINES

బిగ్ బాస్ ఎన్టీఆర్ లుక్ ఇదే

Murali R | Published:June 13, 2017, 12:00 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా బిగ్ బాస్ రియాలిటీ షో కి వ్యాఖ్యతగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే . దానికి సంబందించిన లుక్ ని తాజాగా రిలీజ్ చేసారు స్టార్ మా యాజమాన్యం అలాగే ఎన్టీఆర్ కూడా తన ట్విట్టర్ పేజీ లో బిగ్ బాస్ లుక్ పోస్ట్ చేసాడు . ఆ లుక్ నిజంగానే బిగ్ బాస్ అనేలా ఉంది . నాగార్జున , చిరంజీవి ల లాగే ఎన్టీఆర్ కూడా యాంకర్ అవతారం ఎత్తుతున్నాడు బిగ్ బాస్ రియాలిటీ షోస్ ద్వారా.

హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించగా తమిళంలో కమల్ హాసన్ తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా అలరించనున్నారు . వెండితెర స్టార్స్ బుల్లితెర పైకి వస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషించడం ఖాయం . ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు కానీ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోందో మాత్రం ట్రయల్ చేసారు . అదే ఈ లుక్ . ప్రస్తుతం ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..