Home Headlines ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరో గిఫ్ట్
TOLLYWOOD
 HEADLINES

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరో గిఫ్ట్

Murali R | Published:August 16, 2017, 12:00 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా జై లవకుశ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ఈనెలలో జై లవకుశ లోని లవ పాత్రకు సంబంధించి టీజర్ ని అలాగే కుశ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం . ఇప్పటికే జై పాత్రకు సంబంధించిన లుక్ తో పాటు టీజర్ కూడా కేక పెట్టించిన విషయం విదితమే ! ఇక ఇప్పుడు లవ కుమార్ పాత్ర టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.

ఈనెలలోనే వినాయక చవితి వస్తున్నందున ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కి మళ్ళీ గిఫ్ట్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు . ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా , నివేదా థామస్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు . బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..