Home Headlines ఝలక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
TOLLYWOOD
 HEADLINES

ఝలక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Murali R | Published:August 16, 2017, 12:00 AM IST
అధికార తెలుగుదేశం పార్టీ కి ఝలక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ . ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే . గత ఎన్నికల్లో టిడిపి కి మద్దతు ఇచ్చాడు జనసేన అదినేత , అయితే ఇప్పటి ఉప ఎన్నికలో మాత్రం నా మద్దతు ఎవరికీ ఉండదని , ఒకవేళ ఎవరైనా నా మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటే నాకు ఇందులో సంబంధం లేదని స్పష్టం చేసాడు.

దీంతో తెలుగుదేశం పార్టీ పెద్ద షాక్ కి గురయ్యింది . పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కు మద్దతు ఇవ్వడం ఖాయమని అనుకున్నారు కానీ సర్వే చేసిన లెక్కల ప్రకారం ఎవరికి కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడలేదని అందుకే ఈ ఉప ఎన్నికలకు దూరంగా ఉంటామని ...... పోటీలో ఉండేది 2019 ఎన్నికలలోనే నని స్పష్టం చేసాడు . పవన్ కళ్యాణ్ నిర్ణయం పట్ల జగన్ పార్టీ సంబరాల్లో తేలగా అధికార తెలుగుదేశం మాత్రం ఖంగుతింది.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..