Home Headlines పెళ్లి చూపులు డైరెక్టర్ రెండో సినిమాకు రెడీ
TOLLYWOOD
 HEADLINES

పెళ్లి చూపులు డైరెక్టర్ రెండో సినిమాకు రెడీ

Thursday July 13th 2017
పెళ్లి చూపులు చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్  తన రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు . అయితే ఈసారి నటీనటులుగా కొత్తవాళ్ళని పరిచయం చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు . సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనుంది ఈ చిత్రం . దాస్యం తరుణ్ భాస్కర్ చెప్పిన కథ సురేష్ బాబు కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

పెళ్లి చూపులు చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ని తనవైపు కు తిప్పుకున్న ఈ దర్శకుడి కోసం పలువురు హీరోలు పనిచేయడానికి ముందుకు వస్తున్నారు అయితే ఇతగాడు మాత్రం కొత్తవాళ్లు తో ప్రయోగం చేయడానికి సిద్ధం అవుతున్నాడు . ప్రేక్షకుల రివార్డ్ లతో పాటు పలు అవార్డు లను అందుకున్న ఈ దర్శకుడు రెండో ప్రయత్నంలో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..