Home Headlines అనుష్క తో పెళ్లి గురించి ప్రభాస్ ఏమన్నాడో తెలుసా
TOLLYWOOD
 HEADLINES

అనుష్క తో పెళ్లి గురించి ప్రభాస్ ఏమన్నాడో తెలుసా

Murali R | Published:October 5, 2017, 9:49 AM IST
అనుష్క - ప్రభాస్ లు ప్రేమించుకుంటున్నారని, డిసెంబర్ లో వివాహ నిశ్చితార్థం జరుపుకోనున్నారని  వార్తలు వచ్చిన నేపథ్యంలో ఓ మీడియా సంస్థ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రభాస్ . ఇంతకీ ప్రభాస్ ఏమంటున్నాడో తెలుసా ....... ..... అనుష్క - నాకు మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చిన ప్రతీసారి నిజంగానే మా మధ్య ఏమైనా ఉందా ? అని ఆలోచించాను కానీ అటువంటిదేమీ లేదని అర్థమైంది దాంతో ఇలాంటి రాతలు రాస్తూనే ఉంటారు కాబట్టి వాటిని లైట్ గా తీసుకుంటే బెటర్ అని నేను అనుష్క అనుకున్నాం అని చెప్పాడు ప్రభాస్.

ప్రభాస్ - అనుష్క లు ఇద్దరూ కలిసి బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 లతో కలిపి మొత్తం నాలుగు చిత్రాల్లో నటించారు , పైగా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ బాగా కుదరడంతో ఈ వార్తలు జోరందుకున్నాయి . పైగా ఉమైర్ సందు ఈ డిసెంబర్ లోనే వాళ్ళ నిశ్చితార్థం అని అనేసరికి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది ప్రభాస్ - అనుష్క ల పెళ్లి . అయితే ప్రభాస్ మాత్రం యధావిధిగా ఖండించేసాడు పెళ్లి వార్తలను.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..