Home Headlines బాలయ్య -పూరితో మళ్ళీ సినిమానా
TOLLYWOOD
 HEADLINES

బాలయ్య -పూరితో మళ్ళీ సినిమానా

Murali R | Published:September 5, 2017, 12:00 AM IST

ఇప్పటికే పైసా వసూల్ అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది అయితే బాలయ్య 103 వ సినిమా నా దర్శకత్వంలోనే ఉంటుంది అని అంటున్నాడు దర్శకులు పూరి జగన్నాధ్ . 101వ చిత్రంగా పైసా వసూల్ వచ్చిన విషయం తెలిసిందే . సెప్టెంబర్ 1న రిలీజ్ అయిన పైసా వసూల్ కు డిజాస్టర్ టాక్ వచ్చింది అయితే కొంతలో బెటర్ ఏంటంటే బాలయ్య కొత్తగా కనిపించడం , డైలాగ్ డెలివరీ కానీ లుక్ లో కానీ సరికొత్త బాలయ్య ని ఆవిష్కరించాడు పూరి.

సినిమా మొత్తం లో ఉన్న ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది బాలయ్య మాత్రమే ! పైగా సినిమా ప్లాప్ అయ్యింది కానీ మళ్ళీ బాలయ్య తో సినిమా చేస్తానని , బాలయ్య కూడా మనిద్దరం కలిసి సినిమా చేద్దామని చెప్పారని అందుకే 103వ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాను అంటూ బాంబ్ పేల్చాడు పూరి జగన్నాధ్ . బాలయ్య నిజంగానే ఛాన్స్ ఇస్తే ఆశ్చర్యపోవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఒక్కోసారి ఏమైనా జరగొచ్చు.

Related Links

puri jagannadh latest news
Balakrishna next with Anil Ravipudi
Balakrishna feeling very sad

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..