Home Headlines చిరుతో చేయకుండా కుట్ర చేశారట
TOLLYWOOD
 HEADLINES

చిరుతో చేయకుండా కుట్ర చేశారట

Murali R | Published:September 5, 2017, 12:00 AM IST
చిరంజీవి కి నేను చెప్పిన కథ బాగా నచ్చింది , తప్పకుండా చేస్తానని కూడా అన్నాడు కానీ చిరు చుట్టూ ఉండే కొంతమంది కుట్ర చేయడం వల్ల నాతో సినిమా చేయలేదు , కానీ వదిలేది లేదని తప్పకుండా చిరంజీవి తో సినిమా చేస్తానని అంటున్నాడు దర్శకులు పూరి జగన్నాథ్. అసలు చిరంజీవి 150వ సినిమా పూరి జగన్నాథ్ తోనే అనుకున్నారు కానీ ఫస్టాఫ్ నచ్చింది కానీ సెకండాఫ్ నచ్చకపోవడంతో పూరీని పక్కన పెట్టాడు చిరు.

పూరి జగన్నాథ్ చిరంజీవి అభిమాని కావడంతో ఎలాగైనా సరే చిరు తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ కుదరడం లేదు పాపం. ఇక ఈమద్యే మళ్లీ చిరంజీవి ని కలిసాడట కథ చెప్పాడట అంతేనా ....... చిరంజీవి కి కథ కూడా నచ్చిందని చెబుతున్నాడు పూరి. అప్పుడు కొంతమంది కుట్ర చేయడం వల్ల ఛాన్స్ మిస్ అయ్యాడు మరి ఇప్పుడు మళ్లీ కుట్ర చేస్తారేమో చూడాలి. అయినా పైసా వసూల్ డిజాస్టర్ అయ్యింది కాబట్టి కుట్ర చేయాల్సిన అవసరం ఉండదు.

Related Links

chiranjeevi meet viswanath latest news
Uyyalavada fans unhappy with title
puri jagannadh latest news
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..