Home Headlines చిరంజీవి తో అతడికి విభేదాలు లేవట
TOLLYWOOD
 HEADLINES

చిరంజీవి తో అతడికి విభేదాలు లేవట

Murali R | Published:February 15, 2017, 12:00 AM IST
మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు ప్రాణమని , అయితే మధ్యలో ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల నాకు చిరంజీవి తో గ్యాప్ వచ్చింది తప్ప ఆయనతో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసాడు నటుడు రాజా రవీంద్ర . చిరంజీవి తో పలు చిత్రాల్లో నటించడమే కాకుండా ఆ ఇంటికి సన్నిహితుడు గా కొనసాగిన రాజా రవీంద్ర సినిమాల్లో నటించినప్పటికీ చిరు రాజకీయాల్లోకి రాగానే ఆయన్ని ఫాలో అవ్వడం మానేసాడు అయితే రాజకీయాలు నాకు సరిపడవు కాబట్టి చిరు వెంట వెళ్లలేదని అంతేతప్ప మా మధ్య మరో రకమైన గ్యాప్ లేదని అంటున్నాడు . ఇక పనిలో పనిగా చిరంజీవి ని పొగడటం మొదలు పెట్టాడు . దాదాపు పదేళ్లు గ్యాప్ వచ్చినప్పటికీ చిరు నటనలో కానీ డ్యాన్స్ లో కానీ ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని ప్రశంసలు కురిపిస్తున్నాడు రాజా రవీంద్ర.

అజేయమైన స్టార్ డం చిరు సొంతం అయినప్పటికీ ఇతరుల డేట్స్ కు ఇబ్బంది కలిగించ కూడదు అని తన ఒంట్లో బాగోలేక పోయిన షూటింగ్ చేసి దర్శక నిర్మాతల శ్రేయస్సు కోరుకునే హీరో కేవలం చిరంజీవి మాత్రమే అంటూ ఆకాశానికి ఎత్తేసాడు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..