Home Headlines రాంచరణ్ కన్ఫ్యూజ్ లో ఉన్నాడట
TOLLYWOOD
 HEADLINES

రాంచరణ్ కన్ఫ్యూజ్ లో ఉన్నాడట

Murali R | Published:September 5, 2017, 12:00 AM IST
సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 చిత్రం చేస్తున్నాడు రాంచరణ్ తేజ్ , అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యాక చరణ్ తో మాస్ దర్శకులు బోయపాటి శ్రీను సినిమా చేయాలని భావిస్తున్నాడు కానీ చరణ్ మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే రంగస్థలం 1985 ని కంప్లీట్ చేసాక సైరా నరసింహారెడ్డి మేకింగ్ చూసుకోవాలి కాబట్టి . సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి ఆ సినిమాని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది , అయితే మేకింగ్ విషయాల్లో చరణ్ దగ్గర ఉండల్సిన అవసరం లేదని , హాయిగా మరో సినిమా చేసుకోవచ్చని కూడా అనుకుంటున్నాడట . ఒకవేళ బోయపాటి తో సినిమా చేస్తే రంగస్థలం సినిమా తర్వాత రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి తప్పకుండా ఇది మరో యాంగిల్ ని చూపించడం ఖాయం కాబట్టి బోయపాటి తో చేస్తే బాగానే ఉంటుంది అని భావిస్తున్నాడట . మొత్తానికి చేయాలా ? వద్దా ? అనే కన్ఫ్యూజ్ లో ఉన్నాడు ప్రస్తుతానికి . త్వరలో నిర్ణయం తీసుకుంటాడేమో చూడాలి.

Related Links

Boyapati next with Charan
Ramcharan teamup with Rajamouli
harish shankar next movie with dil raju
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..