Home Headlines బాబాయ్ కోసం చరణ్ ఏం చేస్తున్నాడో తెలుసా
TOLLYWOOD
 HEADLINES

బాబాయ్ కోసం చరణ్ ఏం చేస్తున్నాడో తెలుసా

Wednesday July 12th 2017
పవన్ కళ్యాణ్ బాబాయ్ కోసం అబ్బాయ్ రాంచరణ్ తేజ్ ఏం చేస్తున్నాడో తెలుసా ........ తన సినిమాని ముందుకు తెస్తున్నాడు , పవన్ బాబాయ్ కి తన సినిమా పోటీ కాకుండా థియేటర్ ల సమస్య రాకుండా ఈ పని చేస్తున్నాడు . ఇంతకీ పవన్ కళ్యాణ్ సినిమాకి , చరణ్ సినిమాకి సంబంధం ఏంటని అనుకుంటున్నారా ? పవన్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాని దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదరడం లేదు దాంతో వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ అని ఫిక్స్ అయ్యారు , కట్ చేస్తే రాంచరణ్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న రంగస్థలం కూడా ఈ ఏడాది అనుకున్నారు కానీ కుదరకపోవడంతో సంక్రాంతి కి అనుకున్నారు అయితే బాబాయ్ సినిమాతో పోటీ పడటం వల్ల థియేటర్ ల సమస్య వస్తుంది పైగా పోటీ అన్న భావన మెగా అభిమానుల్లో ఉంటుంది కాబట్టి ఆ వివాదాలకు స్వస్తి చెప్పడానికి చరణ్ ముందడుగు వేసాడు . తన సినిమాని డిసెంబర్ లోనే రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసాడు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..