Home Headlines అర్జున్ రెడ్డి హిందీ లోకి
TOLLYWOOD
 HEADLINES

అర్జున్ రెడ్డి హిందీ లోకి

Murali R | Published:September 4, 2017, 12:00 AM IST
తెలుగునాట సంచలన విజయం సాధిస్తున్న అర్జున్ రెడ్డి కి రీమేక్ ఆఫర్ల గోల ఎక్కువయ్యింది . ఇప్పటికే ఈ చిత్రాన్ని తమిళంలో ధనుష్ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి హక్కులు పొందగా తాజాగా ఈ అర్జున్ రెడ్డి పట్ల బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు . ఇక బాలీవుడ్ లో ముద్దుల వీరుడు , దీపికా పడుకునే ప్రియుడు రణ్ వీర్ సింగ్ అర్జున్ రెడ్డి రీమేక్ పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నాడట . ఇప్పటికే పలు చిత్రాలతో సత్తా చాటిన ఈ రొమాంటిక్ హీరో అర్జున్ రెడ్డి రొమాన్స్ కి ఫిదా అయ్యాడట.

ఇక హిందీలో కూడా ఈ సినిమా కు దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగ . తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రాన్ని అందించి సంచలనానికి కేంద్ర బిందువు అయిన సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో అడుగుపెడితే అక్కడ ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి . తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్న అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో.

Related Links

Arjun Reddy strong warn to V Hanmantharao
Arjun Reddy Movie Review
On befikre first poster ranveer singh vaani kapoor french kiss
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..