Home Headlines రవితేజ సినిమా కూడా పైరసీ బారిన పడింది
TOLLYWOOD
 HEADLINES

రవితేజ సినిమా కూడా పైరసీ బారిన పడింది

Murali R | Published:October 22, 2017, 3:52 PM IST
మాస మహారాజ్ రవితేజ తాజాగా నటించిన చిత్రం రాజా ది గ్రేట్ . ఈనెల 18న రిలీజ్ అయిన రాజా ది గ్రేట్ హిట్ అయ్యింది , అయితే సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం పైరసీ బారిన పడింది . విచిత్రం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోని వాళ్ళు , మిడిల్ క్లాస్ వాళ్ళు ........ అంతగా చదువుకొని వాళ్ళు ఈ పైరసీ సీడీ లు చూస్తున్నారంటే అనుకోవచ్చు కానీ చదువుకున్న వాళ్ళు కాస్త విజ్ఞానం ఉన్నవాళ్లు , డబ్బున్నవాళ్ళు సైతం పైరసీ సినిమాలు చూస్తున్నారు . ఇటీవల ఎయిర్ పోర్ట్ లో ఓ మహిళా తన ల్యాప్ టాప్ లో రాజా ది గ్రేట్ సినిమా చూస్తూ అడ్డంగా దొరికిపోయింది . 
 
 
ఆమె పిక్ ని తీసి ఓ సినిమా అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు రాజా ది గ్రేట్ సినిమా చూస్తోంది అంటూ . అంతే తాను కస్టపడి తీసిన సినిమా పైరసీ కావడంతో పూర్తిగా చలించిపోయిన దర్శకుడు అనిల్ రావిపూడి తన బాధని వ్యక్తం చేస్తూ ఆ ట్వీట్ ని రీ ట్వీట్ చేసాడు. కోట్ల కొద్దీ డబ్బు పెట్టి సినిమాలు తీస్తుంటే సింపుల్ గా డౌన్ లోడ్ చేసి పైరసీ సినిమా చూస్తున్నారు .
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..