Home Headlines మెగా మేనల్లుడు హ్యాట్రిక్ హిట్ కొడతాడా
TOLLYWOOD
 HEADLINES

మెగా మేనల్లుడు హ్యాట్రిక్ హిట్ కొడతాడా

Thursday August 11th 2016

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ రేయ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయినప్పటికీ సకాలంలో ఆ సినిమా రిలీజ్ కాలేదు రెండో సినిమా అయిన పిల్లా నువ్వు లేని జీవితం రిలీజ్ అయి మంచి హిట్ అయ్యింది . ఇక రెండో సినిమాగా వచ్చిన రేయ్ ఘోర పరాజయం పొందింది . దాని తర్వాత వచ్చిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కూడా మంచి హిట్ అయి సాయి కి మంచి పేరు తెచ్చిపెట్టింది ఇక దాని తర్వాత వచ్చిన సుప్రీమ్ కూడా హిట్ అయ్యింది దాంతో వరుసగా రెండు సక్సెస్ ల తర్వాత వస్తున్న ''తిక్క '' చిత్రంతో హిట్ అందుకొని హ్యాట్రిక్ కొడతాడా ? అన్న ఆసక్తి నెలకొంది . సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రోహిన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న రిలీజ్ అవుతోంది . భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పై మెగా మేనల్లుడు చాలా ఆశలే పెట్టుకున్నాడు మరి అతడి ఆశలు నెరవేరుతాయో లేదో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..