Home Headlines సిద్దార్థ్ కు ఇప్పటికైనా హిట్ వస్తుందా
TOLLYWOOD
 HEADLINES

సిద్దార్థ్ కు ఇప్పటికైనా హిట్ వస్తుందా

Murali R | Published:October 4, 2017, 3:33 PM IST

తెలుగు , తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో సిద్దార్థ్ , అప్పట్లో మంచి విజయాలను అందుకున్నాడు కానీ గత నాలుగేళ్లుగా సక్సెస్ లేక డీలా పడిపోయాడు సిద్దార్థ్ . ఒకవైపు ప్రేమ , పెళ్లి అనుకుంటే అది కాస్త బెడిసికొట్టింది దాని తర్వాత సినిమాలపై దృష్టి పెట్టాడు కానీ వరుసగా పరాజయాలు పలకరిస్తుండటంతో రేసులో వెనుకబడిపోయాడు .తమిళ్ లో ఒకటి , రెండు హిట్ చిత్రాలు వచ్చినప్పటికీ ఆ క్రెడిట్ వేరేవాళ్లు కొట్టేసారు .  కట్ చేస్తే ఇప్పుడు గృహం అనే సినిమా చేస్తున్నాడు సిద్దార్థ్.

తమిళ్ లోనే కాకుండా తెలుగు , హిందీ బాషలలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సినిమాపై సిద్దార్థ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడట . కొంతకాలంగా దోబూచులాడుతున్న విజయం గృహం సినిమాతో దక్కడం ఖాయమని ఆశ పడుతున్నాడు . మరి ఈ సినిమా అయినా హిట్ అయి సిద్దార్థ్ ఆశని నెరవేరుస్తుందా ? చూడాలి.

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..