Home Headlines భర్త పై విరుచుకుపడుతున్న సునీత
TOLLYWOOD
 HEADLINES

భర్త పై విరుచుకుపడుతున్న సునీత

Murali R | Published:August 11, 2016, 12:00 AM IST

భార్యకు అండగా ఉండాల్సిన భర్త అండగా ఉన్నానన్న నమ్మకం కలిగించక పోగా నేను ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానని అబద్దాలు చెప్పి అప్పులు చేసి నా పరువు తీసేయడమే కాకుండా బాధ్యతలను విస్మరించి మోసం చేసాడని భర్త పై విరిచుకు పడింది గాయని సునీత . తన భర్త మానని గాయం చేసాడని అందుకే అతడికి దూరంగా ఉంటున్నానని పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ బాగోగులు చూడని వాడు భర్త ఎలా అవుతాడని అతడి పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది సునీత . కిరణ్ ని సింగర్ సునీత 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది ఆమెకు ఇద్దరు సంతానం కూడా . అయితే భర్త కిరణ్ ఇంటి బాధ్యత తీసుకోకుండా అప్పులు చేస్తుండటం తో అతడి నుండి విడిపోయింది అయితే విడాకులు మాత్రం తీసుకోలేదు . రెండో పెళ్లి ఆలోచన కూడా లేదని చెబుతున్న సునీత కిరణ్ తో నరకం అనుభవించానని ఇప్పటికైనా మారతాడని భావించాను కానీ అతడిలో మార్పు రాలేదు ఇక రాదు కూడా అంటూ కన్నీళ్ళ పర్యంతం అయ్యింది . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..