Home Headlines గెల్చుకున్న సొమ్ము అనాధలకు ఇచ్చాడట
TOLLYWOOD
 HEADLINES

గెల్చుకున్న సొమ్ము అనాధలకు ఇచ్చాడట

Murali R | Published:October 2, 2017, 5:51 PM IST
ఎన్టీఆర్ బిగ్ బాస్ లో పాల్గొన్న శివబాలాజీ ఆ షోలో వచ్చిన 50 లక్షలలో టాక్స్ లు పోను మిగిలిన ముప్పై అయిదు లక్షలను ఒక అనాధాశ్రమం కు విరాళంగా ఇచ్చేశాడట శివబాలాజీ . అయితే ఎక్కడ కూడా ఈ విషయాన్నీ బయటకు చెప్పలేదు దాంతో అతడి పై ప్రశంసల వర్షం కురుస్తోంది . ఎందుకంటే కొంత దానం చేసి ఎంతో చేసినట్లుగా ప్రచారం పొందుతున్న ఈ రోజుల్లో శివబాలాజీ గెల్చుకున్న 35 లక్షలను మొత్తంగా అనాథలకు ఇవ్వడంతో అతడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు . 
 
 
తెలుగులో హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించాడు శివబాలాజీ . అయితే అనుకున్న రేంజ్ లో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు అయినప్పటికీ నటన పై మక్కువతో సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు . శివబాలాజీ భార్య స్వప్న మాధురి కూడా హీరోయిన్ గా నటించింది పలు చిత్రాల్లో . బిగ్ బాస్ లో డబ్బు కోసం వెళ్లలేదని అందుకే అక్కడ వచ్చిన డబ్బు ని ఏదైనా మంచి కార్యక్రమానికి ఉపయోగించితే మంచిదని ఇలా చేసాడట శివబాలాజీ . 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..