Home Headlines స్పైడర్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు
TOLLYWOOD
 HEADLINES

స్పైడర్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు

Murali R | Published:September 28, 2017, 12:00 AM IST
మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ చిత్రం నిన్న రిలీజ్ అయ్యింది . ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా ప్రీమియర్ షోలతోనే వన్ మిలియన్ డాలర్ల ని కొట్టేసింది . ఇంతటి భారీ వసూళ్లు రావడానికి కారణం మహేష్ కున్న క్రేజ్ మాత్రమే కారణం . మహేష్ కు ఓవర్సీస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అందుకే ఈ వసూళ్లు . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి వసూళ్లు వచ్చాయి దాంతో ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ వసూల్ చేసిన మొత్తం 39 కోట్లు.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ లెక్కలు అయితే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా చెన్నై , కర్ణాటక , ఓవర్సీస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా సమగ్ర లెక్కలు రావాల్సి ఉంది . సాయంత్రానికి సరైన ఫిగర్ వస్తుంది . ఇప్పటివరకు అయితే 39 కోట్ల వసూళ్ల ని రాబట్టాడు మహేష్ బాబు . మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రానికి మిశ్రమ ఫలితం వచ్చింది . అయితే మహేష్ కున్న ఇమేజ్ తో భారీ వసూళ్లు వస్తున్నాయి . దానికి తోడు దసరా సెలవులు కూడా తోడవడంతో మొదటి వారం మంచి వసూళ్ల ని సాధించడం ఖాయం.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..