Home Headlines ప్రభాస్ కు ఏమైంది
TOLLYWOOD
 HEADLINES

ప్రభాస్ కు ఏమైంది

Murali R | Published:September 16, 2017, 12:00 AM IST
బాహుబలి తో తన రేంజ్ ని అమాంతం పెంచుకున్న హీరో ప్రభాస్ , ప్రస్తుతం సాహో చిత్రం చేస్తున్నాడు . షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ కు అకస్మాత్తుగా అస్వస్థత కు గురయ్యాడు దాంతో ఆందోళన చెందిన యూనిట్ వెంటనే ప్రభాస్ ని ఆసుపత్రికి తరలించారు . ప్రస్తుత్తం ప్రభాస్ కోలుకుంటున్నాడు . అయితే భయపడాల్సిన అవసరం ఏది లేదు అని డాక్టర్లు చెప్పారట . ప్రభాస్ కాస్త నీరసంగా ఉండటంతో షూటింగ్ లో అస్వస్థత కు గురయ్యాడని రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారట . దాంతో ఊపిరి పీల్చుకున్నారు సాహో బృందం.

సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ 150 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే . ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తోంది . తెలుగు , తమిళ , హిందీ బాషలలో రూపొందుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి . బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కావడంతో సాహో కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..