Home Headlines సైరా నరసింహారెడ్డి కి పెద్ద దెబ్బ పడింది
TOLLYWOOD
 HEADLINES

సైరా నరసింహారెడ్డి కి పెద్ద దెబ్బ పడింది

Murali R | Published:September 16, 2017, 12:00 AM IST
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి . ఆ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ ని కాదని ఏ ఆర్ రెహమాన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు కట్ చేస్తే బాలీవుడ్ , హాలీవుడ్ చిత్రాలతో బిజీ గా ఉన్నాను కాబట్టి ఈ సినిమాకు ఎక్కువ సమయం కేటాయించలేను అందుకే నా స్థానంలో మరొకరిని పెట్టుకోండి అని చెప్పాడట ఏ ఆర్ రెహమాన్ . దాంతో చిరంజీవి అండ్ కో షాక్ అయ్యారట ! తమన్ ని కాదని ఏరికోరి రెహమాన్ ని పెట్టుకుంటే ఇప్పుడు ఎక్కువ రోజులు సమయం కేటాయించడం నాకు కుదరదు అని చెప్పడం ఏంటి ? అని మదన పడుతున్నారంట.

రెహమాన్ లాస్ ఏం జెల్స్ లో ఉండాలి హాలీవుడ్ చిత్రాలను చూసుకోవాలి అలాగే బాలీవుడ్ చిత్రాలను కూడా దాంతో సైరా నరసింహారెడ్డి ప్రాజెక్ట్ కి సరైన న్యాయం చేయలేనని చెప్పాడట . అసలు ఈ సినిమాకు ముందుగా తమన్ నే అనుకున్నారు పైగా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి కానీ తీరా సమయానికి తమన్ ని పక్కన పెట్టి రెహమాన్ ని తీసుకున్నారు . ఇక ఇప్పుడు రెహమాన్ పూర్తిగా తప్పుకుంటే తమన్ లేదా దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకుంటారు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..