Home Headlines మొగుడి కోసం ఆరాటపడుతున్న తమన్నా
TOLLYWOOD
 HEADLINES

మొగుడి కోసం ఆరాటపడుతున్న తమన్నా

Murali R | Published:July 10, 2017, 12:00 AM IST
మిల్కీ బ్యూటీ తమన్నా మొగుడి కోసం ఆరాటపడుతోంది , ఇటీవలే తమన్నా ఇంట్లో పెళ్లి వేడుక జరిగింది దాంతో తమన్నా కు కూడా పెళ్లి గాలి సోకింది . ఇన్నాళ్లు అంటే సినిమాలు షికార్లు అంటూ కాలం వెళ్లబుచ్చింది కానీ ఇపుడు మాత్రం పెళ్లి మీద మనసు మళ్లింది దాంతో తన తల్లిదండ్రులకు పెళ్ళికొడుకుని చూడమని చెప్పిందట . తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామకు బాహుబలి ఎనలేని గుర్తింపు ని తీసుకొచ్చింది.

తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలిగి పోతున్న ఈ భామ చేతిలో ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేవు ,దానికి తోడు ఒంటి మీదకి 27 వచ్చాయి కాబట్టి ఇప్పటి నుండి పెళ్లి కొడుకు ని వెతికే పనిలో ఉంటే అతగాడు దొరికాక పెళ్లి చేసుకోవచ్చు అని ఆశల పల్లకిలో తేలిపోతోంది . మరి మిల్కీ బ్యూటీ కి కాబోయే మొగుడు ఎక్కడున్నాడో ?
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..