Home Headlines ఆ నిర్మాతతో ఎఫైర్ లేదంటోంది
TOLLYWOOD
 HEADLINES

ఆ నిర్మాతతో ఎఫైర్ లేదంటోంది

Monday June 12th 2017
బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా తో నాకు ఎటువంటి ఎఫైర్ లేదని కానీ అనవసరమైన పుకార్లు షికారు చేస్తున్నాయని అంటోంది ముద్దుగుమ్మ తాప్సి . తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు ఇక్కడ సరైన హిట్ లభించలేదు దాంతో బాలీవుడ్ బాట పట్టింది . అయితే అక్కడ కూడా అనుకున్న రేంజ్ లో సినిమాలు రాలేదు హిట్ లు దక్కలేదు కానీ పింక్ సినిమాతో ఒక్కసారిగా తాప్సి ఇమేజ్ మారిపోయింది.

లెజెండ్ అమితాబ్ తో కలిసి నటించి అందరి ప్రశంసలు పొందిన ఈ భామ తాజాగా సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్న ''జూడవా 2'' లో నటిస్తోంది , అయితే తాప్సి తో పాటు ఈ సినిమాలో శ్రీలంక భామ జాకెవెలిన్ ఫెర్నాండేజ్ కూడా నటిస్తోంది . శ్రీలంక భామ కంటే తాప్సి తో ఎక్కువగా చనువుగా ఉంటున్నాడట సాజిద్ దాంతో పుకార్లు రోడ్డున పడ్డాయి . ఈ విషయం తాప్సి చెవిన పడటంతో ఆ వార్తలను కొట్టి పడేస్తోంది.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..