Home Headlines జై లవకుశ పై దుష్ప్రచారం చేస్తున్నారు
TOLLYWOOD
 HEADLINES

జై లవకుశ పై దుష్ప్రచారం చేస్తున్నారు

Murali R | Published:September 29, 2017, 3:33 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా జై లవకుశ చిత్రం రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాపై అప్పుడే దుష్ప్రచారం చేస్తున్నారు కొంతమంది పనిగట్టుకొని. ఈ పని గతంలో కూడా ఎన్టీఆర్ సినిమాలకు వ్యతిరేకంగా చేశారు. అయితే జై లవకుశ పరిస్థితి వేరు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించిన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది కానీ పనిగట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కి దూరం కావడంతో ఈ దుష్ప్రచారం మొదలు పెట్టారు.  అయితే జై లవకుశ కి ఆల్రెడీ హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఎంతగా ప్రచారం చేసినా ఫలితం మారదు. జై లవకుశ కు హిట్ టాక్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..