Home Headlines ఎన్టీఆర్ బిగ్ బాస్ పై ఫిర్యాదు
TOLLYWOOD
 HEADLINES

ఎన్టీఆర్ బిగ్ బాస్ పై ఫిర్యాదు

Murali R | Published:August 8, 2017, 12:00 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా బిగ్ బాస్ షో ని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే . ఆ షోపై ఇప్పుడు పెద్ద పిడుగు పడింది . ఈ షోపై హెచ్ ఆర్ సి లో ఫిర్యాదు చేసాడు ఓ వ్యక్తీ . బిగ్ బాస్ షో లో పాల్గొంటున్న వాళ్ళపై వేస్తున్న శిక్షలు దారుణంగా ఉంటున్నాయని తక్షణమే ఆ షో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ అచ్యుత్ రావు అనే వ్యక్తీ హెచ్ ఆర్ సి ని ఆశ్రయించాడు.

బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న వాళ్ళ శిక్షలు దారుణంగా ఉన్నాయని రాత్రి పూట పచ్చిక బయళ్ళ మీద పడుకోవడం , స్విమ్మింగ్ పూల్ లో యాభై సార్లు మునిగి లేవడం , అసభ్యంగా ప్రవర్తించడం , మూతికి ప్లాస్టర్ లను అంటించడం లాంటి శిక్షలు వేస్తూ యువత ని పక్కదోవ పట్టేలా బిగ్ బాస్ కార్యక్రమం ఉంటోందని ఆరోపిస్తున్నాడు . మరి హెచ్ ఆర్ సి ఎలా స్పందిస్తుందో చూడాలి.

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..