Home Headlines ఆకట్టుకుంటున్న ఏంజెల్ ట్రైలర్
TOLLYWOOD
 HEADLINES

ఆకట్టుకుంటున్న ఏంజెల్ ట్రైలర్

Murali R | Published:August 8, 2017, 12:00 AM IST

సోషియో ఫాంటసీ మూవీ ఏంజెల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం విశేషం. దాదాపు 40 నిమషాల గ్రాఫిక్స్ తో ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు నూతన నిర్మాత భువన్ సాగర్. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మరియు నిర్మాణ పర్యవేక్షకులుగా బాధ్యతలు వహించారు. ఇప్పటికే విడుదలైన ఏంజెల్ టీజర్ కు, భీమ్స్ కంపోజ్ చేసిన మ్యూజిక్ కు అనుహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఏంజెల్ ట్రైలర్ కు విశేషమైన ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉందని నిర్మాత భువన్ సాగర్ తెలిపారు. అతి త్వరలో ఏంజెల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా చిత్ర వర్గం చెబుతుంది.

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..