Home Headlines బిచ్చగాడు హీరో సంచలనం సృష్టించేలా ఉన్నాడే
TOLLYWOOD
 HEADLINES

బిచ్చగాడు హీరో సంచలనం సృష్టించేలా ఉన్నాడే

Murali R | Published:February 16, 2017, 12:00 AM IST

బిచ్చగాడు చిత్రంతో తెలుగునాట సంచలన విజయం సాధించిన విజయ్ ఆంటోనీ తాజాగా యమన్ చిత్రంతో వస్తున్నాడు . తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 24న తెలుగు , తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది యమన్ . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పై విజయ్ ఆంటోనీ చాలా ఆశలే పెట్టుకున్నాడు.

విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ భిన్నమైన పంథాలో ప్రయాణిస్తున్న విజయ్ ఆంటోనీ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది బిచ్చగాడు చిత్రంతో . బిచ్చగాడు తర్వాత వచ్చిన బేతాళుడు మంచి వసూళ్ల ని సాధించింది. ఇక యమన్ ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలంటే కొద్ది రోజుల ఆగాల్సిందే.

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..