Home Headlines బిచ్చగాడు రీమేక్ లో విజయ్ దేవరకొండ
TOLLYWOOD
 HEADLINES

బిచ్చగాడు రీమేక్ లో విజయ్ దేవరకొండ

Murali R | Published:September 16, 2017, 12:00 AM IST
తెలుగులో బిచ్చగాడు చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే . తమిళ చిత్రం అయినప్పటికీ మహేష్ బ్రహ్మోత్సవం చిత్రాన్ని పక్కన పెట్టి బిచ్చగాడు చిత్రానికి బ్రహ్మరధం పట్టారు తెలుగు ప్రేక్షకులు . కాగా ఇప్పుడు ఆ చిత్రాన్ని కన్నడంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇక హీరో ఎవరో తెలుసా పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాల హీరో విజయ్ దేవరకొండ . పెళ్లి చూపులు చిత్రంతో ఇండస్ట్రీ దృష్టి ని ఆకర్షించిన విజయ దేవరకొండ అర్జున్ రెడ్డి తో బ్లాక్ బస్టర్ అందుకొని సంచలనం సృష్టించాడు.

కాగా ఇప్పుడు కన్నడంలో కూడా నటించడానికి రెడీ అవుతున్నాడు విజయ్ దేవరకొండ . బిచ్చగాడు చిత్రాన్ని కన్నడంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . థియేటర్ ఆర్టిస్ట్ అయిన విజయ్ దేవరకొండ విజయ్ అంటోనీ కంటే బెటర్ గానే నటిస్తాడనడంలో సందేహం లేదు . తెలుగు , తమిళ బాష లలో సూపర్ హిట్ అయిన బిచ్చగాడు కనండంలో ఎలాంట్ హిట్ అవుతుందో చూడాలి.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..