Home Headlines కొరటాలతో ఇప్పుడైనా సెట్ అవుతుందా చరణ్ కు
TOLLYWOOD
 HEADLINES

కొరటాలతో ఇప్పుడైనా సెట్ అవుతుందా చరణ్ కు

Wednesday July 12th 2017
సూపర్ హిట్ చిత్రాల దర్శకులు కొరటాల శివ వచ్చే ఏడాది వేసవిలో రాంచరణ్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు . నిన్ననే అధికారికంగా ప్రకటించారు కూడా . 2018 వేసవిలో సెట్స్ మీదకు వెళుతుంది అని . కొరటాల శివ తో ఇంతకుముందే చరణ్ ఒక సినిమా స్టార్ట్ చేసాడు కానీ జస్ట్ ప్రారంభోత్సవం మాత్రం జరుపుకొని ఆ సినిమా ఆగిపోయింది . అసలు ఆ సినిమా కొరటాల శివకు రెండో సినిమా . ప్రభాస్ తో మిర్చి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన తర్వాత చరణ్ తో సినిమా స్టార్ట్ చేసాడు కొరటాల కానీ కథ , కథనంలో ఎక్కడో ఇద్దరికీ తేడా కొట్టింది దాంతో ఆ సినిమా అటకెక్కింది.

కట్ చేస్తే మహేష్ బాబు తో శ్రీమంతుడు సినిమా చేసి నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ హిట్ ఇచ్చాడు . దాని తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చేసాడు అది ఎన్టీఆర్ కెరీర్ లో నెంబర్ వన్ సినిమా అయ్యింది . ఇప్పటివరకు చేసిన మూడు చిత్రాలు సూపర్ హిట్స్ కాగా తాజాగా నాలుగో సినిమాగా మహేష్ తో భరత్ అనే నేను చేస్తున్నాడు . దాని తర్వాత చరణ్ తో సినిమా చేయనున్నాడు . మరి ఇప్పుడైనా అంతా సెట్ అయి సెట్స్ మీదకు వెళుతుందా చూడాలి.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..