Home Headlines నిన్నటి ఆరు సినిమాలు డిజాస్టర్ లే
TOLLYWOOD
 HEADLINES

నిన్నటి ఆరు సినిమాలు డిజాస్టర్ లే

Murali R | Published:September 16, 2017, 12:00 AM IST
నిన్న ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి , అందులో ఒక్క సినిమా కూడా కనీసం యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేదు అన్నీ డిజాస్టర్ లే ! రాజమౌళి తండ్రి దర్శకత్వం వహించిన '' శ్రీవల్లి '' రిలీజ్ అయ్యింది , అయితే ఆ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా సరిగ్గా తెలీదు . భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాగుందా అంటే అదీ లేదు . డైరెక్టర్ గా ఘోరంగా విఫలమయ్యాడు విజయేంద్ర ప్రసాద్ . ఇక సునీల్ నటించిన ఉంగరాల రాంబాబు కూడా అంతే క్రాంతి మాధవ్ డైరెక్టర్ కదా అని ఆశపడి వెళ్లిన వాళ్లకు చుక్కలు చూపించాడు క్రాంతి.

అలాగే నారా రోహిత్ , నాగ శౌర్య నటించిన కథలో రాజకుమారి చిత్రం అయితే మరీ దారుణంగా ఉంది , సచిన్ జోషి హీరోగా నటించిన వీడెవడు పరిస్థితి కూడా అంతే సచిన్ కు యాక్టింగ్ రాదు , తాతినేని సత్య కు డైరెక్షన్ రాదు అన్నట్లుగా ఉంది ఆ సినిమా . శింబు - నయనతార జంటగా నటించిన సరసుడు డబ్బింగ్ సినిమా కావడంతో ఆ సినిమాని పట్టించుకున్న వాళ్లే కరువయ్యారు అలాగే ప్రాజెక్ట్ జెడ్ అనే సినిమాని కూడా మొత్తానికి ఆరు వచ్చాయి , పోయాయి . పోయాయి అని చెప్పడానికి పట్టినంత సమయం కూడా లేదు ఈ సినిమాల పరిస్థితి . సెప్టెంబర్ 1నుండి బాక్సాఫీస్ కల తప్పింది . సరైన సినిమా ఏది లేకపోవడంతో డ్రై అయిపొయింది పరిస్థితి.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..