కిర్రాక్ పార్టీ ఏమౌతుందో అని టెన్షన్ పడుతున్న నిఖిల్


కిర్రాక్ పార్టీ ఏమౌతుందో అని టెన్షన్ పడుతున్న నిఖిల్

కన్నడంలో సూపర్ హిట్ అయిన కిర్రాక్ పార్టీ ని తెలుగులో రీమేక్ చేసాడు యంగ్ హీరో నిఖిల్ . ఈ సినిమా ఈనెల 16న విడుదలకు సిద్దమైన నేపథ్యంలో తీవ్ర ఆందోళనలో ఉన్నాడు హీరో నిఖిల్ . ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అన్న టెన్షన్ లో ఉన్నాడు . నిఖిల్ కు ఇది 15వ సినిమా కావడంతో పాటు కొత్త దర్శకుడు శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో వస్తున్న  చిత్రం కూడా కావడంతో కొంత టెన్షన్ గా ఉన్నాడు .

విభిన్న తరహా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ విజయాలు సాధిస్తున్న నిఖిల్ కు కేశవ చిత్రం కాస్త బ్రేక్ వేసింది దాంతో జాగ్రత్త పడ్డాడు నిఖిల్ . అందులో భాగంగానే కన్నడంలో హిట్ అయిన కిర్రాక్ పార్టీ ని రీమేక్ చేయడానికి ఎంచుకున్నాడు . ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడటంతో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు . కిర్రాక్ పార్టీ యూత్ ని ఆకట్టుకుంటుందో ? లేదో ఈనెల 16న తేలిపోనుంది .