అల్లు అర్జున్ హీరోయిన్ నిఖిల్ కు నచ్చలేదట


అల్లు అర్జున్ సరసన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు చిత్రాల్లో నటించింది కేథరిన్ ట్రెసా . రుద్రమదేవి , ఇద్దరమ్మాయిలతో , సరైనోడు ఇలా వరుసగా మూడు చిత్రాల్లో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసి మెగా హీరోయిన్ అనిపించుకుంది కేథరిన్ అయితే అలాంటి హీరోయిన్ ని మెచ్చలేదు యంగ్ హీరో నిఖిల్ . తమిళంలో హిట్ అయిన గణితన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేద్దామని అనుకున్నారు కట్ చేస్తే ఈ విషయం తెలిసి తమిళ్ లో పోషించిన పాత్ర తెలుగులో సైతం నేనే చేస్తానని స్వయంగా కేథరిన్ చెప్పిందట !

అయితే మొదట కేథరిన్ ని తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం వద్దు అని అనుకుంటున్నాడట నిఖిల్ ఎందుకంటే కేథరిన్ తన పక్కన ఉంటే హీరోయిన్ లా కాకుండా డామినేట్ చేసేలా ఉందని పైగా అక్కలా కూడా ఉన్నా ఉండొచ్చని భావిస్తున్నారట !అందుకే కేథరిన్ ని కాకుండా మరొకరిని హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట యంగ్ హీరో నిఖిల్ . అంటే అల్లు అర్జున్ హీరోయిన్ కు హ్యాండ్ ఇచ్చినట్లే .