ఈ డైరెక్టర్ అసలు హీరో తెలుసా


hero venky turned as directorదాదాపు ఎనిమిదేళ్ల  క్రితం రిలీజ్ అయిన స్నేహగీతం , జ్ఞాపకం చిత్రాల్లో హీరోగా నటించాడు కట్ చేస్తే ఇప్పుడు డైరెక్టర్ గా మారాడు అతడే వెంకీ అట్లూరి . ఇటీవల రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన తొలిప్రేమ చిత్రానికి దర్శకత్వం వహించాడు వెంకీ అట్లూరి . అసలు యితడు హీరోగా నటించాడు , అయితే అనుకున్న రేంజ్ లో సక్సెస్ అందకపోవడంతో నటుడిగా కొనసాగే కంటే రచయితగా , దర్శకుడిగా మరోవైపు టర్న్ అయితే బాగుంటుందేమో అని తీవ్రంగా మదన పడ్డాడట ! మొత్తానికి కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ అతడి శ్రమ వృధా కాలేదు .

ఇన్నాళ్ల నిరీక్షణ కు ఫలితం దక్కింది , దర్శకుడిగా మొదటి చిత్రంతోనే సక్సెస్ సాధించాడు . వరుణ్ తేజ్ – రాశి ఖన్నా జంటగా నటించిన తొలిప్రేమ చిత్రానికి దర్శకత్వం వహించి సూపర్ హిట్ కొట్టేసాడు . రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా మంచి వసూళ్ల ని సాధిస్తోంది తొలిప్రేమ . మొత్తానికి హీరోగా నటించడం మానేసి డైరెక్టర్ గా టర్న్ అయి మంచి పనే చేసాడు వెంకీ అట్లూరి .