24 కోట్లు నష్టపోతున్న బయ్యర్లు


huge-loss-for-inttelligent-movie-buyersమెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఇంటలిజెంట్ చిత్రం ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే . ఆ సినిమా వల్ల బయ్యర్లు 24  కోట్లు నష్టపోతున్నారు . మొత్తం 27 కోట్ల వరకు బిజినెస్ జరుగగా రెండున్నర కోట్ల షేర్ మాత్రమే వచ్చింది , మహా అయితే మూడు కోట్లు వస్తుంది అంటే బయ్యర్లు అందరూ కలిసి 24 కోట్లు నష్టపోతున్నారు ఆ సినిమాని నమ్మి కొన్నందుకు . సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో హిట్ లకంటే డిజాస్టర్ ల లిస్తే ఎక్కువగా ఉంది . వరుసగా అయిదు ప్లాప్ లను చవిచూశాడు మెగా మేనల్లుడు .

వివివినాయక్ దర్శకుడు కాబట్టి నమ్మకంతో ఆ మేరకు కొన్నారు కానీ ఇక్కడ వినాయక్ మేజిక్ కూడా పనిచేయలేదు . మొదటి రోజు నుండే డిజాస్టర్ టాక్ రావడంతో ఆ చిత్ర యూనిట్ ఖంగు తిన్నారు . బయ్యర్లు భారీ ఎత్తున నష్టపోతున్నారు కాబట్టి కొంత సర్దుబాటు చేయాలనీ భావిస్తున్నారట ! మొత్తానికి ఇంటలిజెంట్ వల్ల భారీ డిజాస్టర్ మూట గట్టుకొని పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్ .