భరత్ అనే నేను ట్రైలర్ మోత మోగుతోంది


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్ర ట్రైలర్ నిన్న రాత్రి యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసాడు . ట్రైలర్ బాగుండటంతో సోషల్ మీడియాలో మోత మోగుతోంది . మహేష్ బాబు ముఖ్యమంత్రి గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది . కొరటాల శివ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు .

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా మంచి సందేశాన్ని ఇస్తున్నాడు కొరటాల శివ . నిన్న భారీ ఎత్తున భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కాగా సినిమాని ఏప్రిల్ 20 న విడుదల చేయనున్నారు . మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడు అంటే యాక్షన్ ని అంతగా స్కోప్ ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేసిన వాళ్లకు ట్రైలర్ లో చక్కని సమాధానం ఇచ్చారు చిత్ర బృందం . ముఖ్యమంత్రిగా కూడా ఫైట్స్ చేస్తున్నాడు మహేష్ . దాంతో ఫ్యాన్స్ కి మాత్రమే కాదు మిగతా వాళ్ళు కూడా భరత్ అనే నేను ట్రైలర్ ని చూస్తున్నారు . దాంతో మోత మోగుతోంది .