65 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్నాడు


imran khan third marriage news goes viralపాకిస్థాన్ మాజీ కెప్టెన్ , రాజకీయ నాయకుడు అయిన ఇమ్రాన్ ఖాన్ 65 ఏళ్ళ వయసులో ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నాడు . ఇప్పటికే రెండుసార్లు పెళ్లిళ్లు చేసుకొని వాళ్లతో గొడవపడి విడాకులు ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ లో ప్రతిపక్ష నాయకుడిగా చెలామణి అవుతున్నాడు . రాజకీయాల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటుండటం తో అక్కడి మీడియా గగ్గోలు పెడుతోంది దాంతో ఈపెళ్ళిళ్ల వ్యవహారం ఇమ్రాన్ తో పాటు ” తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ ” పార్టీ నాయకులకు కూడా మింగుడు పడటం లేదు .

అయితే ఇమ్రాన్ మాత్రం పాక్ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు , పెళ్లి నా వ్యక్తిగతం అంతేకాని పాకిస్థాన్ విషయాలు భారత్ కి అందిస్తే తప్పు పట్టాలి కానీ నాసొంత విషయాలను గురించి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అంటూ మండిపడుతున్నాడు . అయితే మీడియా వాళ్ళ తో పాటు మిగతావాళ్ళు కూడా ఇమ్రాన్ కు 65 ఏళ్ళు దాటాయి ఈ వయసులో మూడో పెళ్లి చేసుకొని ఏం చేస్తాడు అంటూ ఛలోక్తులు విసురుతున్నారు పాపం .