Home Headines
TOLLYWOOD
 Headlines

రవితేజ సినిమా కూడా పైరసీ బారిన పడింది

Sunday October 22nd,2017
మాస మహారాజ్ రవితేజ తాజాగా నటించిన చిత్రం రాజా ది గ్రేట్ . ఈనెల 18న రిలీజ్ అయిన రాజా ది గ్రేట్ హిట్ అయ్యింది , అయితే సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం పైరసీ బారిన పడింది . విచిత్రం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోని వాళ్ళు , మిడిల్ క్లాస్ వాళ్ళు ........ అంతగా చదువుకొని వాళ్ళు ఈ పైరసీ సీడీ లు చూస్తున్నారంటే అనుకోవచ్చు కానీ చదువుకున్న వాళ్ళు కాస్త విజ్ఞానం ఉన్నవాళ్లు , డబ్బున్నవాళ్ళు సైతం పైరసీ సినిమాలు చూస్తున్నారు . ఇటీవల ఎయిర్ పోర్ట్ లో ఓ మహిళా తన ల్యాప్ టాప్ లో రాజా ది గ్రేట్ సినిమా చూస్తూ అడ్డంగా దొరికిపోయింది .      ఆమె పిక్ ని తీసి ఓ సినిమా అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు రాజా ది గ్రేట్ సినిమా చూస్తోంది అంటూ . అంతే తాను కస్టపడి తీసిన సినిమా పైరసీ కావడంతో పూర్తిగా చలించిపోయిన దర్శకుడు అనిల్ రావిపూడి తన బాధని వ్యక్తం చేస్తూ ఆ ట్వీట్ ని రీ ట్వీట్ చేసాడు. కోట్ల కొద్దీ డబ్బు పెట్టి సినిమాలు తీస్తుంటే సింపుల్ గా డౌన్ లోడ్ చేసి పైరసీ సినిమా చూస్తున్నారు .
Read More...

అనుష్క తో పెళ్లి గురించి ప్రభాస్ ఏమన్నాడో తెలుసా

Thursday October 05th,2017
అనుష్క - ప్రభాస్ లు ప్రేమించుకుంటున్నారని, డిసెంబర్ లో వివాహ నిశ్చితార్థం జరుపుకోనున్నారని  వార్తలు వచ్చిన నేపథ్యంలో ఓ మీడియా సంస్థ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రభాస్ . ఇంతకీ ప్రభాస్ ఏమంటున్నాడో తెలుసా ....... ..... అనుష్క - నాకు మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చిన ప్రతీసారి నిజంగానే మా మధ్య ఏమైనా ఉందా ? అని ఆలోచించాను కానీ అటువంటిదేమీ లేదని అర్థమైంది దాంతో ఇలాంటి రాతలు రాస్తూనే ఉంటారు కాబట్టి వాటిని లైట్ గా తీసుకుంటే బెటర్ అని నేను అనుష్క అనుకున్నాం అని చెప్పాడు ప్రభాస్.ప్రభాస్ - అనుష్క లు ఇద్దరూ కలిసి బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 లతో కలిపి మొత్తం నాలుగు చిత్రాల్లో నటించారు , పైగా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ బాగా కుదరడంతో ఈ వార్తలు జోరందుకున్నాయి . పైగా ఉమైర్ సందు ఈ డిసెంబర్ లోనే వాళ్ళ నిశ్చితార్థం అని అనేసరికి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది ప్రభాస్ - అనుష్క ల పెళ్లి . అయితే ప్రభాస్ మాత్రం యధావిధిగా ఖండించేసాడు పెళ్లి వార్తలను.
Read More...

సిద్దార్థ్ కు ఇప్పటికైనా హిట్ వస్తుందా

Wednesday October 04th,2017
తెలుగు , తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో సిద్దార్థ్ , అప్పట్లో మంచి విజయాలను అందుకున్నాడు కానీ గత నాలుగేళ్లుగా సక్సెస్ లేక డీలా పడిపోయాడు సిద్దార్థ్ . ఒకవైపు ప్రేమ , పెళ్లి అనుకుంటే అది కాస్త బెడిసికొట్టింది దాని తర్వాత సినిమాలపై దృష్టి పెట్టాడు కానీ వరుసగా పరాజయాలు పలకరిస్తుండటంతో రేసులో వెనుకబడిపోయాడు .తమిళ్ లో ఒకటి , రెండు హిట్ చిత్రాలు వచ్చినప్పటికీ ఆ క్రెడిట్ వేరేవాళ్లు కొట్టేసారు .  కట్ చేస్తే ఇప్పుడు గృహం అనే సినిమా చేస్తున్నాడు సిద్దార్థ్.తమిళ్ లోనే కాకుండా తెలుగు , హిందీ బాషలలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సినిమాపై సిద్దార్థ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడట . కొంతకాలంగా దోబూచులాడుతున్న విజయం గృహం సినిమాతో దక్కడం ఖాయమని ఆశ పడుతున్నాడు . మరి ఈ సినిమా అయినా హిట్ అయి సిద్దార్థ్ ఆశని నెరవేరుస్తుందా ? చూడాలి.
Read More...

125 కోట్లు వసూల్ చేసిన ఎన్టీఆర్

Wednesday October 04th,2017
12 రోజుల్లో 125 కోట్లు వసూల్ చేసి బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సెప్టెంబర్ 21న భారీ ఎత్తున రిలీజ్ అయిన జై లవకుశ పన్నెండు రోజుల్లో 125 కోట్ల గ్రాస్ వసూళ్ల ని , 72 కోట్ల షేర్ ని వసూల్ చేసాడు ఎన్టీఆర్. జై లవకుశ బయ్యర్లు కూడా లాభాల బాటలో పయనించాలంటే మరో 23 కోట్ల షేర్ రాబట్టాలి.ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం , అందునా జై పాత్ర లో ఎన్టీఆర్ నటవిశ్వరూపానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈరోజుతో దసరా సెలవులు పూర్తవుతున్నాయి దాంతో ఎన్టీఆర్ కు అసలైన పరీక్ష మొదలుకానుంది. ఎందుకంటే జై లవకుశ మరో 23 కోట్లు వసూల్ చేస్తేనే బయ్యర్లు లాభాలలోకి వస్తారు.
Read More...

రెండో పెళ్లి ఆలోచనలో రేణు దేశాయ్

Wednesday October 04th,2017
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల తల్లి అయిన రేణు దేశాయ్ పవన్ నుండి విడిపోయిన విషయం తెలిసిందే . ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణే లో ఉంటోంది . కాగా తాజాగా ఓ టివి షోలో డ్యాన్స్ షో కి జడ్జిగా వ్యవహరించడానికి హైదరాబాద్ వచ్చింది . అయితే ఆ సమయంలో పలు ఛానళ్ల తో మాట్లాడిన రేణు దేశాయ్ అనారోగ్య బారిన పడ్డానని , ఆ సమయంలో చావు దగ్గరగా వెళ్లి వచ్చానని అప్పుడే మరొక మనిషి సహాయం అంటే ఏమిటో తెలిసి వచ్చింది , అందుకే ఒంటరిగా ఎక్కువ కాలం ఉండలేమని ........ మరో పెళ్లి ఆలోచన వచ్చిందని అయితే దాని గురించి కాలమే నిర్ణయించాలి అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడింది రేణు దేశాయ్.ఇప్పటికైతే రేణు దేశాయ్ కి రెండో పెళ్లి చేసుకోవాలని బలంగా లేదు కానీ కాలం అనుకూలిస్తే ....... రెండో పెళ్లి వైపు బలంగా నెట్టితే తప్పదు కదా అన్న ధోరణి లో మాట్లాడింది . అలాగే పవన్ కళ్యాణ్ నుండి విడిపోయినప్పుడు పెద్ద మొత్తంలో నేను డబ్బులు , ఆస్థులు తీసుకున్నట్లు మీడియాలో వచ్చిందని అదంతా శుద్ధ అబద్దమని అంటోంది.
Read More...

మరణించిన యంగ్ హీరో

Wednesday October 04th,2017
యంగ్ హీరో గ్యాంగ్రిన్ వ్యాధితో మరణించడంతో కన్నడ చిత్రపరిశ్రమ షాక్ కి గురయ్యింది . కన్నడ హీరోగా రాణిస్తున్న యువ హీరో రాకేష్ (27) నిన్న రాత్రి ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో మరణించాడు . ఆశారాణి - నాగేష్ అనే దంపతుల ముద్దుల కుమారుడు ఈ రాకేష్ . తల్లిదండ్రులు ఇద్దరు కూడా నటీనటులు కావడంతో వాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లోకి వచ్చాడు రాకేష్ . '' పపూసీ కామెడీ '' తో ఫేమస్ అయిన రాకేష్ గతకొంత కాలంగా గ్యాంగ్రీన్ అనే  వ్యాధితో బాధపడుతున్నాడు.దాంతో రెండు నెలల క్రితం చికిత్స తీసుకున్నాడు , కానీ తగ్గినట్లే తగ్గి మళ్ళీ ఆ వ్యాధి తిరగబెట్టడంతో సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చేరాడు . కానీ అప్పటికే వ్యాధి బాగా ముదిరిపోవడంతో నిన్న రాత్రి కన్నుమూశాడు . రాకేష్ మరణవార్త కన్నడ చిత్రపరిశ్రమ ని కుదిపేసింది . ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు ఇలా అర్దాంతరంగా చనిపోవడం వాళ్ళని కలిచి వేసింది . రాకేష్ హీరోగా నటించిన '' ధూమపాన '' అనే చిత్రం ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
Read More...

ఆ సినిమా చూడొద్దని చెప్పాడట

Wednesday October 04th,2017
సమంత ఆత్మగా నటించిన రాజుగారి గది 2 చిత్రం చూసావంటే సమంత తో కలిసి ఒకే గదిలో పడుకోలేవు అంతగా భయపెడుతుంది అని నాగచైతన్య కు సలహా ఇచ్చాడట నాగార్జున , ఇంకేముంది తండ్రి లాంటి సీనియర్ నటుడే అలా సలహా ఇచ్చాడు కాబట్టి నేను అస్సలు రాజుగారి గది 2 చూడనని చెప్పాడట నాగచైతన్య. కింగ్ నాగార్జున కీలక పాత్రలో రూపొందించిన చిత్రం రాజుగారి గది 2.సమంత ఈ చిత్రంలో ఆత్మగా నటించింది. క్లైమాక్స్ ఎపిసోడ్ లో కానీ అంతకుముందు కానీ సమంత విపరీతంగా భయపెడుతుందట . దాంతో నాన్న ఆ సినిమా చూడకు ఎందుకంటే సమంత ని పెళ్లి చేసుకుంటున్నావ్ కాబట్టి , ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉండాలి కాబట్టి ఆ సినిమా చూస్తే సమంత తో కలిసి ఉండలేవని డైరెక్ట్ గా చెప్పాడట . చైతూ కూడా రియలైజ్ అయి రాజుగారి గది 2 చూడనని చెప్పాడని నాగార్జున తెలిపాడు. ఈనెల 6, 7 తేదీలలో సమంత  , నాగచైతన్య పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే.
Read More...

ఎన్టీఆర్ సరసన ఆ భామనా ?

Tuesday October 03rd,2017
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా జై లవకుశ తో హిట్ అందుకున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు ఎన్టీఆర్ , కాగా ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి సమాయత్తం కానున్నాడు . అయితే అనుకున్న సమయానికంటే కాస్త ఆలస్యంగా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్రీ అయ్యాడు కానీ ఇంకా త్రివిక్రమ్ ఫ్రీ కాలేదు . ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు . దాన్ని కంప్లీట్ చేసాక అప్పుడు ఎన్టీఆర్ సినిమా మీద ద్రుష్టి పెడతాడు.అయితే ఈ సినిమాలో నటించే ప్రధాన తారాగణం ని ఒక్కొక్కరిగా ఎంపిక చేస్తూనే ఉన్నారు . తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం బ్రిటీష్ హాట్ భామ '' అమీ జాక్సన్ ''ని ఎంపిక చేశారట ఒక హీరోయిన్ గా . ఇప్పటికే ఈ భామ నటించిన సినిమాల కంటే ఒంపు సొంపులను అతిగా ప్రదర్శించి పేరుగాంచింది . ఇక ఎన్టీఆర్ -త్రివిక్రమ్ ల సినిమాలో కనుక ఛాన్స్ కొట్టేస్తే మరో హిట్ సినిమా లభించినట్లే అమీ జాక్సన్  కు.
Read More...

సంక్రాంతి బరినుండి తప్పుకుంటున్న మహేష్

Tuesday October 03rd,2017
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా భరత్ అనే నేను చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు . మొన్నటి వరకు కూడా అదే ఫిక్స్ అయ్యారు కట్ చేస్తే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ సంక్రాంతి బరి నుండి తప్పుకున్నాడట . సంక్రాంతి కాకుండా వేసవిలో సినిమాని రిలీజ్ చేసేట్లుగా ప్లాన్ చేస్తున్నాడట.ఇప్పటికే పలు చిత్రాలు సంక్రాంతి కి వస్తున్నట్లు ప్రకటించాయి కాబట్టి ఆదర బాదరగా సినిమా చేసి అప్పుడు రిలీజ్ చేసి ఇబ్బంది పడేకంటే కాస్త నిదానంగా సినిమా చేసి మంచి సమయం తీసుకొని సోలో గా వస్తే బెటర్ అని డిసైడ్ అయ్యారట భరత్ అనే నేను చిత్ర బృందం . అందుకే ఈనెల 6నుండి జరగాల్సిన ఫారిన్ షెడ్యూల్ కూడా కొద్దిరోజులు వాయిదా వేశారట . కైరా అద్వానీ మహేష్ సరసన నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు . శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ - మహేష్ బాబు ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read More...

భారీగా లాభాలను తెస్తున్న మహానుభావుడు

Tuesday October 03rd,2017
శర్వానంద్ హీరోగా నటించిన మహానుభావుడు భారీగా లాభాలను తెచ్చి పెడుతోంది నిర్మాతలకు . దసరా కానుకగా సెప్టెంబర్ 29న రిలీజ్ అయిన మహానుభావుడు మొత్తం మూడు రోజుల్లో పది కోట్ల షేర్ ని సాధించి భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది దాంతో ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది . మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్ సరసన మెహరీన్ కౌర్ నటించగా ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు.ప్రపంచ వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో 7. 65 కోట్ల షేర్ ని రాబట్టాడు మహానుభావుడు . అలాగే ఓవర్సీస్ , కర్ణాటక ,రెస్ట్ ఆఫ్ ఇండియా లలో మరో రెండున్నర కోట్ల షేర్ వసూల్ చేసింది దాంతో మొత్తంగా 10 కోట్లకు పైగా షేర్ ని కేవలం మూడు రోజుల్లోనే వసూల్ చేసి సంచలనం సృష్టిస్తున్నాడు శర్వానంద్ . వరుసగా అగ్ర హీరోలతో పోటీపడుతూ సక్సెస్ లు కొడుతున్నాడు శర్వానంద్ . యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి కేవలం మూడు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి రావడంతో ఆ చిత్ర బృందం విజయోత్సవ వేడుక కూడా నిర్వహించింది.
Read More...
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..