పవన్ కళ్యాణ్ ని అవమానించిన సాక్షి
TOLLYWOOD
 TOPSTORY

పవన్ కళ్యాణ్ ని అవమానించిన సాక్షి

Murali R | Published:October 25, 2017, 12:55 PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అవమానించింది జగన్ పత్రిక అయిన సాక్షి పత్రిక. మొన్న ఎన్టీఆర్ హీరోగా నటించిన కొత్త సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే , ఆ సినిమాకు క్లాప్ కొట్టడానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరైన విషయం కూడా విదితమే . అయితే ఆ సినిమా న్యూస్ లో కేవలం ఎన్టీఆర్ ఫోటో ని మాత్రమే చాలా పెద్దదిగా వేశారు కానీ ఎన్టీఆర్ పక్కనే నిలుచున్న పవన్ కళ్యాణ్ ఫోటో ని మాత్రం వేయలేదు సరికదా పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫోటో ని కట్ చేసి మరీ వేశారు. 
 
 
 
పవన్ కళ్యాణ్ స్టార్ హీరో పైగా జనసేన అధ్యక్షుడు కూడా అలాంటిది పవన్ కళ్యాణ్ పట్ల జగన్ పత్రిక ఇలా చేసిందంటే నిజంగా పవన్ కు జగన్ భయపడుతున్నట్లే లెక్క. గత ఎన్నికల్లో పవన్ తెలుగుదేశం కు మద్దతు ఇచ్చాడు దాంతో జగన్ కి పవన్ అంటే కోపం . అసలు ఇద్దరు స్టార్ హీరోలు కలిసిన కార్యక్రమం అందునా క్లాప్ కొట్టి ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు చెప్పిన సందర్భం  కాబట్టి ఇద్దరి ఫోటోలు కూడా పెద్దగా వేయాల్సిన సందర్భం కానీ జగన్ పత్రిక అలా చేయలేదు . పవన్ పై కక్ష్య కట్టి అతడి ఫోటో రాకుండా చేసింది.  పవన్ ఫోటో వేయనంత మాత్రాన అతడి స్టార్ డం ని తగ్గించగలం అనుకుంటే అది జగన్ అండ్ కో పొరపాటు ముమ్మాటికీ . పవన్ బొమ్మ కే భయపడితే జగన్ ఎలా ముఖ్యమంత్రి అవుతాడు ?Comments

FOLLOW
 TOLLYWOOD