టీజర్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉంది
TOLLYWOOD
 TOPSTORY

టీజర్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉంది

Murali R | Published:August 9, 2017, 12:00 AM IST
ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అభిమానులను అలరించడానికి , బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు మహేష్ . ఇంతకీ మహేష్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా ......... స్పైడర్ టీజర్ . సరిగ్గా ఒక నిమిషం పది సెకండ్ల పాటు ఉన్న స్పైడర్ టీజర్ చాలా లావిష్ గా గ్రాండియర్ లుక్ లో ఉంది ఇక ఆ టీజర్ ని చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అనే రేంజ్ లో ఉంది కంటెంట్ . ఖచ్చితంగా మహేష్ కు ఇది బ్లాక్ బస్టర్ అనడంలో సందేహం లేదు.

ఇక మహేష్ ఫ్యాన్స్ కి ఈ టీజర్ పిచ్చ పిచ్చగా నచ్చడం ఖాయం . బ్రహ్మోత్సవం వంటి భారీ ప్లాప్ తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి మహేష్ ఫ్యాన్స్ ఆ అపజయాన్ని మరిచిపోయి కాలర్ ఎగరేసేలా స్పైడర్ టీజర్ ఉంది . మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ మహేష్ సరసన నటిస్తుండగా ఎస్ జెసూర్య , భరత్ లు విలన్ లుగా నటిస్తున్నారు . ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 27న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.
Comments

FOLLOW
 TOLLYWOOD