ఎన్టీఆర్ కు మళ్ళీ అతడే విలన్


jagapathibabu villain for ntr యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే . ఏప్రిల్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో ఇప్పటికే పూజా హెగ్డే ని హీరోయిన్ గా ఎంపిక చేసారు కాగా ఇప్పుడు విలన్ గా జగపతిబాబు ని ఎంపిక చేశారట . ఆల్రెడీ ఎన్టీఆర్ – జగపతిబాబు ల కాంబినేషన్ లో ఇంతకుముందు ” నాన్నకు ప్రేమతో ” వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చింది .

 

నాన్నకు ప్రేమతో చిత్రంలో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపించగా అంతే స్టైలిష్ విలన్ గా జగపతిబాబు కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు . కాగా మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి త్రివిక్రమ్ సినిమా కోసం తలపడుతున్నారు . తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మిస్తుండగా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఏప్రిల్ లో ప్రారంభం కానుంది . ఎన్టీఆర్ – జగపతిబాబు లది హిట్ కాంబినేషన్ కాబట్టి మళ్ళీ ఈ సినిమాతో కూడా దాన్ని రిపీట్ చేయడం ఖాయమని ధీమాగా ఉన్నారు .