ఎన్టీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ లో పుట్టిన బిడ్డ కాబట్టి అతడ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి అంటూ పలువురు ఎన్నారై లు నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారట దాంతో ఒకింత షాక్ కి గురయ్యాడు నారా లోకేష్ . అయితే తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ రోజురోజుకి దిగజారి పోతోంది కాబట్టి ఆ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్ కు ఇస్తే తప్పకుండా బెటర్ రిజల్ట్ ఉంటుందని ఎన్నారై ల నమ్మకం , అంతేకాదు తెలంగాణ తమ్ముళ్లు కూడా అదే భావిస్తున్నారు ఎందుకంటే ఎన్టీఆర్ జనాలను ఆకర్షించగల సత్తా ఉంది దానివల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు అని భావిస్తున్నారు .

ఇక ఎన్టీఆర్ ని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా  ప్రకటిస్తే , మిగతా పక్షాలతో కలిసి పోరాడితే టిఆర్ ఎస్ ని ఓడించడం పెద్ద కష్టం కాదని అంటున్నారు తెలంగాణ తమ్ముళ్లు . అయితే ఎన్టీఆర్ కు ఇప్పుడే ప్రత్యక్ష  రాజకీయాల్లోకి రావడం ఇష్టమే లేదు , అలాగే తెలంగాణ బాధ్యతలను ఎన్టీఆర్ కు ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా లేడు కూడా ఒకవేళ అలా జరిగితే తెలుగుదేశం కు పూర్వ వైభవం రావచ్చు లేకపోతే ఇంతే సంగతులు .