చరణ్ ఫోటో పై ఎన్టీఆర్ ఏం కామెంట్ చేసాడో తెలుసా


Jr NTR tweet on a pic of Charan with Sr NTRరాంచరణ్ తేజ్ తాజాగా సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ని చూస్తూ దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . లెజెండ్ ఎన్టీఆర్ ఇప్పటి నటీనటులకు ఎంతో స్ఫూర్తి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు . తెలుగు తెరకు హీరోయిజాన్ని పరిచయం చేసిన హీరో సీనియర్ ఎన్టీఆర్ . నటనలోనే కాదు రాజకీయరంగంలో కూడా చెరగని ముద్ర వేసాడు ఎన్టీఆర్ . కాగా చరణ్ ఎన్టీఆర్ ఫోటో దగ్గర కూర్చొని ఆయన్ని చూస్తున్న పిక్ అటు మెగా అభిమానుల్లో ఇటు నందమూరి అభిమానుల్లో కూడా సంతోషాన్ని వెల్లివిరిసేలా చేస్తోంది .

కాగా తాతయ్య ఎన్టీఆర్ తో చరణ్ ఉన్న ఫోటో ని ట్వీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ” మహానుభావుల ఆలోచన నుండి ప్రేరణ ” అంటూ ట్వీట్ చేసాడు . ఆ మహానుభావుడి ప్రేరణ తోనే ముందడుగు వేస్తున్నాం అంటోంది యువరక్తం . ఆ మహానుభావుడు చూపించిన హీరోయిజం లో మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు ఎన్టీఆర్ – చరణ్ లు . మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎన్టీఆర్ – చరణ్ లు .
తాజాగా ఎన్టీఆర్ – చరణ్ లు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి సమాయత్తం అవుతున్నారు . ఈ సినిమా కంటే ముందే ఎన్టీఆర్ – చరణ్ లు మంచి స్నేహితులు . బావా …… బావా అని ఆప్యాయతగా పిలుచుకుంటారు . కట్ చేస్తే ఆ బాండింగ్ వల్లే జక్కన్న ఇద్దరితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు . ఇక ఈ ఇద్దరూ కలిసి చేసే మల్టీస్టారర్ రికార్డుల దుమ్ము దులిపేయడం ఖాయంగా కనిపిస్తోంది .