కబాలి రికార్డ్ ని అందుకోలేక పోయిన కాలా


kaala fails to beat kabaliకబాలి మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 88 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . కానీ నిన్న విడుదలైన కాలా మాత్రం కేవలం 50 కోట్ల పై చిలుకు మాత్రమే వసూల్ చేసి భారీ కోత పెట్టింది . కబాలి చిత్రం రజనీకాంత్ – పా . రంజిత్ ల కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం అలాగే ట్రైలర్ , టీజర్ లతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి దాంతో భారీ ఓపెనింగ్స్ ని సాధించింది కబాలి . వరల్డ్ వైడ్ 87. 5 కోట్ల గ్రాస్ ని సాధించి అప్పట్లో రికార్డ్ సృష్టించింది కబాలి . అయితే సినిమా అనుకున్న విజయం సాధించలేదు . తమిళనాడు లో తప్ప మిగతా చోట్ల ఘోర పరాజయం పొందింది అలాగే తమిళనాడు లో కూడా కొంతమంది బయ్యర్లు ఆ సినిమా వల్ల నష్టపోయారు కూడా .

కట్ చేస్తే ….. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ లో కాలా చిత్రం రూపొందడంతో క్రేజ్ లేకుండా పోయింది దాంతో కేవలం 250 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది . కబాలి ని దర్శకుడు పా . రంజిత్ ఎలా రూపొందించాడో ప్రేక్షకులకు తెలుసు కాబట్టి కాలా పై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు దానికి తోడు ట్రైలర్ కానీ , టీజర్ కానీ , సంగీతం కానీ ఏవి కూడా ఇంప్రెస్ చేయలేదు . దాంతో కాలా చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించలేక పోయింది . ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల పైచిలుకు వసూళ్ల ని సాధించింది . అంటే కబాలి కి కాలా చిత్రానికి 37 కోట్ల తేడా ? అంత భారీ తేడా అంటే అర్ధం చేసుకోవచ్చు కాలా చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు అని చెప్పడానికి .