సినిమారంగంలో మరో విషాదం


సినిమారంగంలో మరో విషాదం నెలకొంది , కన్నడ నటుడు ఈడకల్లు చంద్రశేఖర్ (63) గుండెపోటు తో  తుది శ్వాస విడిచాడు . కన్నడ చిత్ర రంగంలో బాలనటుడిగా వేషాలు మొదలుపెట్టిన చంద్రశేఖర్ ప్రస్తుతం కెనెడా లో స్థిరపడ్డాడు . అక్కడే కన్నుమూశాడు, చంద్రశేఖర్ మృతి వార్త తెలియగానే కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి . నటుడిగా , దర్శకుడిగా తన సత్తా చాటిన చంద్రశేఖర్ పలువురు సినీ ప్రముఖులు ఆత్మీయుడు . 
 
నటుడిగా కొనసాగుతూనే కెనెడా లో స్థిరపడి అక్కడి దౌత్య కార్యాలయంలో కూడా పనిచేసాడు . భార్య , కూతురు తో కలిసి అక్కడే ఉంటున్నాడు . కెనెడాలోనే స్థిరపడ్డాం కాబట్టి చంద్రశేఖర్ అంత్యక్రియలు కెనెడా లోనే నిర్వహిస్తామని చంద్రశేఖర్ కూతురు స్పష్టం చేసింది . దాదాపు 60 సినిమాల్లో నటించిన చంద్రశేఖర్ అకాల మృతి కి పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు .