సీనియర్ నటి కృష్ణకుమారి కన్నుమూత


సీనియర్ నటి కృష్ణకుమారి (84) ఈరోజు ఉదయం బెంగుళూర్ లో తుది శ్వాస విడిచారు . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణకుమారి స్వస్థలం పశ్చిమ బెంగాల్ లోని నైహతి . మార్చి 6న 1933 లో జన్మించింది కృష్ణకుమారి , షావుకారి జానకి కృష్ణకుమారి కి స్వయానా అక్క . నవ్వితే నవరత్నాలు చిత్రంతో తెలుగులో నటిగా ప్రవేశించింది . ఎన్టీఆర్ , ఏ ఎన్నార్ , కృష్ణ , శోభన్ బాబు ల సరసన పలు సినిమాల్లో నటించింది . 
 
తెలుగు , తమిళ , హిందీ , కన్నడ , మలయాళ భాషలలో నటించింది కృష్ణకుమారి . 110 కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణకుమారి బెంగుళూర్ కి చెందిన అజయ్ మోహన్ ని పెళ్లి చేసుకుని బెంగుళూర్ లో స్థిరపడింది . కృష్ణకుమారి మరణం పట్ల  పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు .